Ravi Teja: మాస్ మహారాజ్తో సూపర్ హీరో సినిమా
గతేడాది ఈగల్(Eagle), మిస్టర్ బచ్చన్(Mr. Bachan) సినిమాలతో ఫ్లాపులు అందుకున్న మాస్ మహారాజా రవితేజ(Raviteja) ప్రస్తుతం భాను భోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో మాస్ జాతర(mass jathara) అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు ఆఖరి దశకు చేరుకుంది. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే రవితేజ తన తర్వాతి సినిమాను కూడా అదే బ్యానర్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మ్యాడ్(Mad) సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) చెప్పిన ఓ సూపర్ హీరో కాన్సెప్ట్ ను నాగవంశీ(Naga Vamsi) రవితేజతో నిర్మించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం మ్యాడ్ కు సీక్వెల్ గా మ్యాడ్2(Mad2) చేస్తున్న కళ్యాణ్ శంకర్ ఆ తర్వాతి సినిమాను కూడా సితార బ్యానర్ లోనే చేయడానికి సైన్ చేశాడు.
మ్యాడ్2 కూడా హిట్ అయితే వెంటనే రవితేజ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. మ్యాడ్2 సినిమా బాగా వచ్చిందని యూనిట్ సభ్యులు చాలా ధీమాగా చెప్తున్నారు కాబట్టి రవితేజ తో కళ్యాణ్ శంకర్ సినిమా దాదాపు ఖాయమైనట్టే. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశముంది. ఈ సినిమా రవితేజ ఇమేజ్ కు తగ్గట్టుగా సూపర్ హీరో కాన్సెప్ట్ తో పాటూ ఎంటర్టైనింగ్ గా కూడా ఉంటుందంటున్నారు.













