Ravi Teja: మంచి కంటెంట్ వస్తే ఓటీటీ ఎంట్రీకి రెడీ

సోషల్ మీడియా బాగా పెరిగిన నేపథ్యంలో ఓటీటీల హవా ఎక్కువగా నడుస్తోంది. అందుకే బాలీవుడ్, టాలీవుడ్ లోని బడా స్టార్లు కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లో సినిమాలు, సిరీస్‌లు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏదీ కుదరకపోతే రియాలిటీ షో లు చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. అందుకే స్టార్‌డమ్ తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ ఓటీటీలో కనిపించాలనుకుంటున్నారు.
అందులో భాగంగానే గత కొంతంకాలంగా టాలీవుడ్ లో కూడా ఓటీటీ కంటెంట్ కు డిమాండ్ పెరగడంతో స్టార్ హీరోలు సైతం డిజిటల్ ఎంట్రీ ఇస్తూ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఇప్పటికే వెంకటేష్(venkatesh), బాలకృష్ణ(balakrishna), జగపతిబాబు(jagapathi babu) లాంటి సీనియర్లు ఓటీటీ ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ కు దగ్గరవుతుంటే, ఇప్పుడు మరో హీరో ఓటీటీలో నటించడానికి తాను రెడీ అంటున్నాడు.
అతనే మాస్ మహారాజా రవితేజ(ravi teja). మాస్ జాతర(mass jathara) ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో భాగంగా డైరెక్టర్ భాను భోగవరపు(bhanu bhogavarapu) రవితేజను ఉద్దేశించి మీరు ఓటీటీ కంటెంట్ మొత్తాన్ని కవర్ చేస్తారు కదా, మిమ్మల్ని ఓటీటీ కంటెంట్ లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అని అడగ్గా, దానికి కచ్ఛితంగా చేయొచ్చు, తాను దేనికైనా రెడీనే అని, మంచి కంటెంట్ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పాడు. మరి రవితేజను మెప్పించే కథతో ఎవరు అతని దగ్గరకు వెళ్తారో చూడాలి.