డిసెంబర్ నుంచి రష్మిక తగ్గేదేలే..
ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక చాలా తక్కువ టైమ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగా, నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఈ మధ్య రష్మిక క్రేజ్ తగ్గిందని అందరూ అనుకున్నారు. పుష్ప2 తప్ప రష్మిక చేతిలో మరో పెద్ద సినిమా లేదని, అసలు ఇండస్ట్రీలో ఎక్కడా రష్మిక పేరు వినిపించట్లేదని అనుకున్నారంతా.
దానికి తోడు నితిన్-వెంకీ కుడుముల సినిమాను కాల్షీట్స్ సర్దుబాటు కాక ఓ హిందీ సినిమా కోసం వదులుకుంటే ఆ మూవీ క్యాన్సిల్ అవడంతో అయ్యో పాపం అనుకున్నారు. ఒకానొక టైమ్ లో రష్మిక ఫేడవుట్ అవుతుందా అని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. కానీ ఈ బ్యూటీ మాత్రం తన కెరీర్ ను ఎంతో బాగా ప్లాన్ చేసుకుంది.
ఈ డిసెంబర్ 1న రష్మిక యానిమల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇందులో రష్మికది మంచి క్యారెక్టర్ అని అంటున్నారు. దానికి తోడు యానిమల్ సినిమా కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఆ సినిమా తర్వాత రెయిన్ బో అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రష్మిక.
జనవరి లేదా ఫిబ్రవరిలో రెయిన్ బో రిలీజ్ కాబోతుంది. ఇక ఆ తర్వాత అంటే వచ్చే ఏడాది మిడిల్ లో పుష్ప2 రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. అంటే డిసెంబర్ తో మొదలుపెడితే తర్వాత నుంచి వరుసగా రష్మిక మాస్ చూడటం ఖాయంగా కనిపిస్తుంది. ఇవి కాకుండా విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి సినిమా, ధనుష్-శేఖర్ కమ్ముల మూవీ, రాహుల్ రవీంద్రన్ తో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా రష్మిక చేయనుంది.













