రష్మికకు సెంటిమెంట్‌గా మారిన డిసెంబర్
మనుషులన్నాక ఎవరికైనా సెంటిమెంట్స్ ఉంటాయి. చిత్ర పరిశ్రమలో అవి ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. సినిమా లాంఛ్ నుంచి రిలీజ్ వరకు ప్రతీదీ ముహూర్తం పైనే ఆధారపడి ఉంటుంది. డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలకు ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువ, వారు వాటిని తప్పకుండా పాటిస్తూ ఉంటారు కూడా. తాజాగా రష్మిక కు కూడా అలాంటి ఓ సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది. అయితే ఈ సెంటిమెంట్ ను అమ్మడు తనకు తానుగా పెట్టుకున్నట్లు కనిపించడం లేదు. ఏదో అనుకోకుండా అలా ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయినప్పటికీ ఇప్పుడు అదే సెంటిమెంట్ గా మారినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెల రష్మికకు పెద్ద సెంటిమెంట్ అని సమాచారం. రష్మిక మొదటి సినిమా కిరిక్ పార్టీ డిసెంబర్లోనే రిలీజ్ అయి మంచి హిట్ అందుకుంది.
తర్వాత వచ్చిన అంజనిపుత్ర సినిమా కూడా డిసెంబర్లోనే రిలీజై విమర్శకుల ప్రశంసలందుకుంది. రీసెంట్ గా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పుష్ప సినిమా కూడా డిసెంబర్ లోనే రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటూ రష్మికకు నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత అమ్మడికి బాలీవుడ్ లో కూడా మంచి ఛాన్సులొచ్చాయి. బాలీవుడ్లో తన మొదటి సినిమా గుడ్ నైట్ కూడా డిసెంబర్లో రిలీజై మంచి పేరు తెచ్చుకుంది.
ఇప్పుడు అమ్మడు నటిస్తున్న మరో బాలీవుడ్ సినిమా యానిమల్ కూడా డిసెంబర్ లోనే రిలీజ్ కానుండటంతో ఈ సినిమా విజయంపై రష్మిక చాలా హోప్స్ పెట్టుకుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో పాటూ రష్మిక పుష్ప2 సినిమాలో కూడా నటిస్తోంది.













