రణవీర్ కోరిక దీపిక తీరుస్తుందా?
అందుకే అంటుంటారు భూమి గుండ్రంగా ఉంటుందని. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ పాటించకుండా.. అయిదారుగురికి తక్కువ కాకుండా పిల్లల్ని కనేవారు. అప్పట్లో ఎంతమంది పిల్లలుంటే అంత గొప్ప. కానీ తర్వాత్తరువాత కుటుంబ నియంత్రణ వచ్చేసింది. ఇద్దరు లేక ముగ్గురు అనే స్థాయి నుంచి ఒకరు లేదా ఇద్దరు అనే పరిస్థితి వచ్చేసింది. మొన్నమొన్నటివరకు ఒకరితోనే సరిపెట్టుకున్న జంటల్ని కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు మళ్లీ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పటితరం ఇంటి నిండా పిల్లలుండాలని కోరుకుంటోంది. ఈ తరానికి ప్రతినిధిగా రణవీర్‌సింగ్ నిలుస్తున్నాడు. తనకు వీలయినంత ఎక్కువ మంది పిల్లలకు తండ్రి కావాలని కోరికగా ఉందని అంటున్నాడు. మరి రణవీర్ కోరికను దీపిక ఏ మేరకు పాటిస్తుందో వేచి చూడాలి.













