ఆమె కోసం ఎంత దూరమైన వెళ్లాలనుకున్నా
రణవీర్ సింగ్, దీపికా పదుకొనే చాలా కాలం పాటు ప్రేమ ఉన్నాక వివాహం చేసుకున్నారు. సుమారుగా నాలుగైదేళ్లు ఈ ప్రేమ వ్యవహారం నడిచింది. ఈ సమయంలో అంటే పెళ్లికి ముందు చాలా అనుభవాలు ఎదురయ్యాయి. వాటిలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా దీపిక పదుకొణెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్సయ్యానని చెప్పారు. ఎప్పుడైనా దీపికను వదులుకోవాల్సి వస్తుందేమో అని అనిపించిందా అన్నదానికి సమాధానం ఇస్తూ, నాకు అలా ఎప్పుడూ అనిపించలేదు. మా ప్రేమ విషయంలో ఎన్నో ఒడుదొడుకులు వచ్చాయి. కానీ దీపికనే పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి ఆమె కోసం ఎంత దూరమైనా వెళ్లాలనుకున్నాను. ఓసారి చిత్రీకరణ నిమిత్తం వేరే ప్రదేశంలో ఉన్నాను. దీపికను చూడాలనిపించి వెంటనే ఆమె వద్దకు వెళ్లిపోయాను. అలాగని గంటల పాటు ఆమెతో సమయం గడపలేదు. కేవలం కొన్ని నిమిషాలు దీపికతో ఉండాలనిపించి అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకుని దీపిక వద్దకు వెళ్లిపోయా అని చెప్పారు.













