నూతన దంపతులు మిహీక, రానా భార్య భర్తలుగా వెబ్ సిరీస్
రానా సినిమాలు మొదటినుండి ఒక రేంజ్ లో క్రేజ్ వుండే సినిమాలు చేసాడు ఆయన సినిమాలన్నీ దాదాపుగా ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. స్టార్ హీరో అనే ఇమేజ్ వున్న సరే రానా కూడా చాలా వరకు జాగ్రత్తగా మంచి కథలు ఎంపిక చేస్తాడు. దాదాపు సినిమాలన్నీ కూడా భిన్నంగా నే ఉంటాయి. ఇప్పుడు రానా రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. సినిమాల విషయం పక్కన పెడితే ప్రతుతం ఓటీటిలో ఒక వెబ్ సిరీస్ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల కొంత మంది సినిమా దర్శక నిర్మాతలతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తుంది. ఒక వెబ్ సిరీస్ చేయాలనే కోరిక ఉందని చెప్పాడట.
ఈ క్రమంలోనే ఒక చిన్న పిల్లవాడి తండ్రి గా నటించే అవకాశం ఉందని, కరోనా వైరస్ సమయంలో విద్యార్థిగా ఒక పిల్లాడు పడుతున్న ఇబ్బందులను వెబ్ సిరీస్ లో చూపించే అవకాశం ఉందనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరిగింది. ఒక విద్యార్థి ఆన్లైన్ క్లాసులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆ కథ నే ఇప్పుడు వెబ్ సీరీస్ లో చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు ఈ వెబ్ సీరీస్ కు సంబంధించి కథ కూడా సిద్ధం చేశారట. అయితే ఈ వెబ్ సీరీస్ లో రానాతో కలిసి రానా భార్య మిహీక నటించే అవకాశం ఉంది. ఆమె కూడా ఇప్పటికే ఈ సీరీస్ లో నటించడానికి కూడా ఓకే చెప్పింది. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు మొదలవుతుంది ఏంటి అనేది మాత్రం స్పష్టత లేదు. దీనికి సంబంధించిన కథను పరుచూరి గోపాలకృష్ణ కూడా ఇస్తున్నారట. మాటలను తనికెళ్ల భరణి ఇస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఎక్కడ వరకు చూపిస్తారు ఏంటి అనేది చూడాలి.













