మగధీరకు పదేళ్లు
తొలి చిత్రం చిరుత విడుదలకు ముందే చిరుతనయుడు రామ్‌చరణ్‌కు మెగా పవర్‌స్టార్ అనే బిరుదు ప్రదానం జరిగిపోయి ఉండొచ్చు. కానీ సదరు బిరుదును జస్టిపై చేసిన చిత్రం మాత్రం చెర్రీ మలి చిత్రం మగధీర. దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పలు రికార్డుల ప్రకంపనలు సృష్టించింది. ఈ చిత్రం విడుదలై నిన్నటికి సరిగా పదేళ్లు. 2009 జులై 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పదేళ్ల అనంతరం ఎన్టీఆర్‌తో కలిసి, రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న ట్రిపూలార్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జులైలో విడుదల కానుంది.













