లక్ష్మీస్ ఎన్టీఆర్ మళ్లీ తెరపైకి
ఇక మూలన పడిపోయిందనుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాంగోపాల్ వర్మ తాజాగా ప్రకటించారు. దసరాకి మొదలు పెట్టి, సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని, త్వరలో తిరుపతిలో నిర్వహించే మీడియా సమావేశంలో మిగతా వివరాలన్నీ ప్రకటిస్తామని అన్నారు. జి.వి.ఫిల్మ్స్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి రాకేష్ రెడ్డి నిర్మాత. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా జనవరిలో రెండు వారాల వ్యవధిలో విడుదల కానుండడం తెలిసిందే.













