అర్థమైందా రాజా..?
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా ఆడియో విడుదల సందర్బంగా అర్థమైందా రాజా డైలాగ్ .. ప్రకంపనలు రేపుతోంది. మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా..’’ అంటూ ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన పరిస్థితులను వివరిస్తూ పలికిన మాటలకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అయితే ఇవి ఎవరిని ఉద్దేశించి అన్నారన్న అంశం ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. వైసీపీని ఉద్దేశించి అన్నారంటూ వ్యూస్ రావడం .. ఆపార్టీ నేతలను ఇబ్బంది పెడుతోంది. అయితే తన సినిమాల గురించి హీరో విజయ్ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారన్న అభిప్రాయంతోనే రజినీ.. ఈకౌంటర్ డైలాగ్స్ వేశారని మరికొందరు అంటున్నారు.













