మరోమారు సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఆడి పాడనున్న ఖుష్బూ
తమిళ్ సినీ పరిశ్రమలో ఒకప్పుడు జయలలిత, ఎంజీఆర్, శివాజీ గణేషన్ వంటి వారిని విపరీతంగా అభిమానించేవారు. ఇక ఎంజీఆర్ తర్వాత హీరోలలో అంతటి క్రేజ్, వీరాభిమానులు కలిగిన స్టార్ ఎవరంటే కళ్లు మూసుకుని తలైవా రజనీకాంత్ అని చెప్పవచ్చు. కోలీవుడ్‌లో అజిత్, విజయ్ వంటి వారికి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కూడ ఎక్కువకాలం తమిళుల చేత ఆరాధింపబడుతున్న స్టార్ ఎవరంటే సూపర్ స్టార్ రజిని కాంత్ అని చెప్పాలి. ఇక తమిళంలో నచ్చిన హీరోయిన్లకు ఏకంగా గుడులు కట్టి అష్టోత్తర, శతనామాలు చేస్తూ ఉంటారు. ఆ క్రేజ్ జయలలిత తర్వాత ఖుష్బూకి, ఆ తర్వాత నమిత, హన్సిక, ప్రస్తుతం నయనతారలకు మాత్రమే ఉంది. కానీ వీరెవ్వరు ఖుష్బూకి పోటీ కాదు. ఖుష్బూ పేరుతో దోసెలు, ఇడ్లీ వంటి ఆహారాలు, గుళ్లు గోపురాలు ఉన్నాయి. ఇక ఈమధ్య రజనీకాంత్ తన వయసుకు తగ్గ చిత్రాలను చేస్తూనే కొత్త కొత్త దర్శకులకు కూడా అవకాశం ఇస్తున్నాడు రజిని కాంత్ . రోబోలో ఐశ్వర్యారాయ్, ఆ తర్వాత త్రిష, రాధికా ఆప్టే, ఈశ్వరీరావు, హుమా ఖురేషి, అమీ జాక్సన్, సిమ్రాన్, నయనతార వంటి సీనియర్లతోనే జోడీ కట్టాడు.
దర్బార్ చిత్రంలో కూడా నయనతారతో శృతి మించకుండా వారి మధ్య ఏమీ లేదనే విధంగా పాత్రను మలుచుకున్నాడు. నివేదా థామస్ ని తన కూతురి పాత్రలో చూపించారు. ప్రస్తుతం రజనీ తమిళంలో వరసగా అజిత్‌కి భారీ విజయాలను అందించిన టాలీవుడ్ నుండి పరిచయం అయినా సినిమా టోగ్రాఫర్, డైరెక్టర్ శివ దర్శకత్వంలో అన్నాతై అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ రజనీకి 168వ చిత్రం కావడం విశేషం. ఇందులో ఖుష్బూ, మీనా, నయనతార వంటి వారు నటిస్తున్న కీర్తి సురేష్ వంటి యంగ్ హీరోయిన్ కూడా యాక్ట్ చేస్తోంది. కానీ ఈ చిత్రంలో కీర్తి సురేష్ రజనీకి చెల్లెలి పాత్రను పోషిస్తోందని సమాచారం. ఇక ఇందులో చాలా కాలం గ్యాప్ తర్వాత ఆయన సీనియర్ హీరోయిన్ ఖుష్బూతో రొమాన్స్ చేయనున్నాడని సమాచారం. గతంలో వీరిద్దరు అన్నామలై, పాండియన్, మన్నన్, నటుకు ఓర్ నల్లవన్ వంటి చిత్రాలలో కలిసి నటించారు. అన్నాతై మూవీలో రజనీ, ఖుష్బూలకి ఓ డ్యూయెట్ కూడా ఉంటుందని సమాచారం . 2021సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి రజనీతో పలు హిట్ చిత్రాలను తీసిన సన్ పిక్చర్స్ సంస్థ ఎంతో గ్రాండియర్ గా నిర్మిస్తోన్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో వేచిచూడాల్సి ఉంది.













