ఒకే సినిమా.. ఐదు కథలు, ఐదుగురు దర్శకులు. సౌత్‌లో అమెజాన్ చేస్తున్న తొలి ప్రయోగం!
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమా తీసి దాన్నిప్రేక్షకులు ఆకట్టుకునే చేయడం, వారిని థియేటర్ల వరకు రప్పించడం అనేది సామాన్యమైన విషయం కాదు. రొటీన్ కథలు, రొటీన్ యాక్షన్ డ్రామాలతో ప్రేక్షకులు విసుగెత్తిపోయి ఉన్నారు. వారు కొత్త తరహా కథలు, కొత్త కాన్సెప్ట్‌లు ఆహ్వానిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని యంగ్ డైరెక్టర్లు కొత్త కథలతో సిద్ధమవుతున్నారు. కొంతమంది సక్సెస్ అవుతున్నారు కూడా. ముఖ్యంగా సినిమాటిక్ కథల కంటే వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన కథలనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రయోగాలకు కూడా శ్రీకారం చుడుతున్నారు మేకర్స్. ఆమధ్య బాలీవుడ్లో లస్ట్ స్టోరీస్ పేరుతో ఓ సినిమా రూపొందింది. నాలుగు కథలతో, నలుగురు దర్శకులతో చేసిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పడు అదే తరహా తమిళ్లో ‘పుతం పుదు కాలై ’ పేరుతో ఓ సినిమా రూపొందింది.
ఐదుగురు డైరెక్టర్లు ఐదు విభిన్న కథలతో మన ముందుకు రాబోతున్నారు. ఈ కథలన్నీ లాక్డౌన్ సమయంలో జరిగిన కథలుగా దర్శకులు రెడీ చేశారు. ప్రస్తుతం డిజిటల్ రంగంలో ఉన్న పోటీని తట్టుకునేందుకు అమెజాన్ ఈ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ సినిమా తెలుగుతోపాటు వివిధ భాషల్లో అక్టోబర్ 16న విడుదల కానుంది. సుహాసినీ మణిరత్నం, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సుధా కొంగర, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
ఇందులో ఇందులో జయరామ్, ఊర్వశి, కాళిదాస్ జయరామ్, కళ్యాణి ప్రియదర్శన్, ఎం.ఎస్. భాస్కర్, రితువర్మ, శ్రుతిహాసన్, సుహాసిని, అనూ హాసన్, కథాడి రామమూర్తి, కోమలం చారుహాసన్, ఆండ్రియా జెరెమియా, గురుచరణ్ సి తదితరులు నటించారు. ఇలాంటి ప్రయోగాలను సినిమా వేదికగా చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి అమెజాన్ దీన్ని డిజిటల్ మూవీగా నిర్మించింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దీనికి చాలా మంచి స్పందన లభించింది. ఒక్కరోజులోనే 2 మిలియన్ వ్యూస్‌కి పైగా రావడం విశేషం. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంటూ తప్పకుండా ఇది సక్సెస్ అయ్యే మూవీ అనిపిస్తోంది. సౌత్‌లో తొలిసారి చేసిన ఈ ప్రయోగానికి ప్రేక్షకులు ఎలాంటి ఫలితాన్నిస్తారో చూడాలి.













