బాహుబలి2 రికార్డును బ్రేక్ చేయనున్న పుష్ప2
కలెక్షన్స్ పరంగానే కాకుండా రిలీజ్ విషయంలో కూడా బాహుబలి2(Baahubali2) సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అప్పటివరకు ఏ ఇండియన్ మూవీ రిలీజ్ కానన్ని థియేటర్లలో బాహుబలి2 ను ఏకంగా పది వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు. బాహుబలి తర్వాత కూడా ఈ స్థాయిలో ఏ సినిమా రిలీజ్ కాలేదు. రాజమౌళి(Rajamouli) ఆర్ఆర్ఆర్(RRR) సైతం ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది.
ఇప్పుడు బాహుబలి2 రికార్డును పుష్ప2(Pushpa2) బ్రేక్ చేయనున్నట్లు సమాచారం. పుష్ప2 కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్ ను వాడుకుని భారీ ఓపెనింగ్స్ రాబట్టాలని పుష్ప2ను భారీగా రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పుష్ప2ను ఏకంగా 11,500 స్క్రీన్లలో రిలీజ్ చేయనున్నారట.
కేవలం ఇండియాలో 6,500 స్క్రీన్లలో పుష్ప2 రిలీజ్ కానుంది. విదేశాల్లో 5 వేల స్క్రీన్లలో రిలీజ్ కానుంది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా ఈ రేంజ్ లో రిలీజ్ కాలేదు. తెలుగు సినిమాలను పెద్దగా పట్టించుకోని పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా పుష్ప2కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే పుష్ప2ను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. పుష్ప2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.













