లైగర్ తర్వాత పూరీ సినిమా ఎవరితో..?
డేర్ అండ్ డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో లైగర్ అనే పాన్ ఇండియన్ సినిమాను తెరకెక్కిస్తున్న పూరీ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 9న రిలీజ్ చేయనున్నారు. దీని తర్వాత పూరీ ప్రాజెక్ట్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
లైగర్ తర్వాత బాలయ్యతో సినిమా చేస్తాడనుకున్నారు కానీ బాలయ్య బోయపాటి సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఉండనుందని అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశారు. దీంతో మళ్లీ బాలయ్య, పూరీ కాంబోలో సినిమా సెట్ అవడానికి టైమ్ పడుతుందనే విషయం అర్థమైపోతుంది. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ లేదంటే నాగశౌర్య తో పూరీ సినిమా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఒక ప్రేమకథతో నాగశౌర్యను డైరెక్ట్ చేయడానికి పూరీ ప్లాన్ చేస్తున్నాడట. లైగర్ తర్వాత పూరీ చేయబోయే సినిమా ఇదేనని అంటున్నారు. ఇంతేకాక పవన్ తో సినిమా చేయడానికి పూరీ ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మహేష్, పూరీ కాంబో ని సెట్ చేయడానికి నిర్మాత అనిల్ సుంకర ఎప్పటి నుంచో చర్చలు జరుపుతున్నట్లు టాక్. మరి ఈ ముగ్గురిలో పూరీ ఏ హీరోతో కమిట్ అయి సెట్స్ మీదకు వెళతాడో చూడాలి.













