Yash: మిత్రన్ తో యష్ ప్రయోగం?

కెజిఎఫ్(KGF), కెజిఎఫ్2(KGF2) సినిమాలతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ ను సంపాదించుకున్న రాక్ స్టార్ యష్(Yash), దాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్త పడుతున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం యష్ రెండు భారీ పాన్ వరల్డ్ సినిమాలను చేస్తున్నాడు. అందులో ఒకటి గీతూ మోహన్‌దాస్(Geethu Mohandas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్(Toxic) అనే సినిమా.
రెండోది బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ. ఈ రెండు సినిమాల్లో టాక్సిక్ 2026 మార్చి 19న రిలీజ్ కానుండగా, రెండు భాగాలుగా రానున్న రామాయణ(ramayana) 2026 దీపావళికి, 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్న యష్, ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
కోలీవుడ్ డైరెక్టర్ పీఎస్ మిత్రన్(PS Mitran) దర్శకత్వంలో సినిమా చేయడానికి యష్ డిస్కషన్స్ చేస్తున్నాడని సమాచారం. యష్ కోసం మిత్రన్ ఓ ప్రయోగాత్మక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను రెడీ చేస్తున్నారని, అన్నీ అనుకున్నట్టు జరిగితే నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లోనే మొదలయ్యే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అనౌన్స్‌మెంట్ వచ్చే వీలుందని తెలుస్తోంది.