War2: వార్2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై స్పందించిన నిర్మాణ సంస్థ
ఎన్టీఆర్(NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కలయికలో అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వంలో తెరకెక్కిన వార్2(War2) సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 14న వార్2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వార్2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చలే జరుగుతున్నాయి.
అందులో భాగంగానే వార్2 ప్రీ రిలీజ్ ఈవెంట్(War2 Pre Release Event) విజయవాడ(Vijayawada)లో జరగబోతుందని, ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ హాజరవనున్నారని వార్తలొస్తుండగా అది నెట్టింట భారీగా ప్రచారం అవుతుంది. ఈ వార్తలపై వార్2 మేకర్స్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. వార్2 ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేశారు.
వార్2 ఈవెంట్ ఎక్కడ చేయాలనేది ఇంకా డిసైడ్ చేయలేదని, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాకే రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని చెప్పడంతో వార్2 ఈవెంట్ గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్టైంది. గతంలో దేవర(Devara) ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో గందరగోళం నెలకొనగా, ఇప్పుడు వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వార్2 మేకర్స్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.







