‘చిత్రం ఎక్స్’ ఫస్ట్ లుక్ విడుదల
రాజ్‌బాల, మానస హీరో హీరోయిన్లుగా రమేష్ విభూది దర్శకత్వంలో పోలం గోవిందయ్య నిర్మిస్తున్న చిత్రం ‘చిత్రం ఎక్స్’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని నిర్మాత రాజ్‌కందుకూరి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ మంచి కంటెంట్‌తో, ప్లానింగ్ ఓ సినిమా చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ చిత్రం కూడా ఆ కోవలోనే విజయం సాధించాలని కోరుకుంటున్నానను అని తెలిపారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై వచ్చిన హారర్ సినిమాలకు భిన్నంగా తమ చిత్రం వుంటుందని, తప్పకుండా అందర్ని ఆశ్చర్యపరుస్తుందని దర్శకుడు తెలియజేశాడు. పలాస శ్రీను, బాచీ, సునీల్ రావినూతల నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శివ ప్రణయ్, సమర్పణ: బేబీ రాజశ్రీ.













