Magic: మరోసారి వార్తల్లోకెక్కిన మ్యాజిక్
సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో మ్యాజిక్(Magic) అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొత్త వాళ్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్(Anirudh) సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ(Naga Vamsi) చేసిన ఆ సినిమాను మరోసారి వార్తల్లో నిలబెట్టాయి.
మ్యాజిక్ సినిమా కొన్ని కారణాల వల్ల లేటవుతూ వచ్చిందని అంతే తప్ప సినిమా క్యాన్సిల్ అవలేదని వంశీ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఆరు సాంగ్స్ కంప్లీట్ అయ్యాయని, మరో సాంగ్ ను పూర్తి చేయాల్సి ఉందని, ఒక్కో పాటను రిలీజ్ చేయాలని మొదట అనుకున్నప్పటికీ, సినిమా పాటల ప్రాముఖ్యత నేపథ్యంలో అన్ని సాంగ్స్ ఒకేసారి జ్యూక్ బాక్స్ రూపంలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు.
గతంలో సినిమా సాంగ్స్ ను ఇలానే ఒకేసారి రిలీజ్ చేసేవారు. కానీ మధ్యలో ఒక్కో సాంగ్ చొప్పున రిలీజ్ చేసే ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ మ్యాజిక్ సినిమాతో పాత పద్ధతిని తీసుకురాబోతున్నట్టు నాగవంశీ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాతో బిజీగా ఉన్న గౌతమ్ తిన్ననూరి ఆ సినిమా తర్వాత దీన్ని రిలీజ్ చేయనున్నాడు.













