ప్రియాంక చోప్రానూ మోసం చేశాడు!
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తన బ్రాండ్ జువెలరీకి అండాసిడర్‌గా బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాను వాడుకొని మోసం చేశాడు. ఈ విషయమై ప్రియాంకా, నీరవ్‌పై దావా వేసిందన్న వార్తలు వచ్చాయి. అయితే ఆమె నీరవ్‌పై దావా వేయలేదని, కేవలం ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకోవడానికి న్యాయ సలహా కోరిందని ఆమె తరపు ప్రతినిధి చెప్పారు. మోదీపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కాంట్రక్ట్‌ను రద్దు చేసుకోవాలని ప్రియాంకా భావిస్తున్నది. గతడాది జనవరి నుంచి నీరవ్ మోదీ బ్రాండ్‌కు ప్రియాంకా అంబాసిడర్‌గా ఉంది. ఈ జువెలరీ ధర రూ.5 లక్షల నుంచి రూ. 50 కోట్ల వరకూ ఉండటం విశేషం. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 11వేల కోట్ల కుంభకోణం జయటపడిన నేపథ్యంలో నీరవ్, అంతకుముందే దేశం వదిలి పారిపోయాడు.













