Pravasthi: కీరవాణిపై సింగర్ ఆరోపణలు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(SP Balasubrahmanyam) మొదలుపెట్టిన పాడుతా తీయగా(Paadutha theeyaga) షో కు ఎంత మంచి ఆదరణ ఉందో తెలిసిందే. అందుకే ఆయన లేకపోయినా ఆ షో ను ఎస్పీ చరణ్(SP Charan) నడిపిస్తున్నాడు. రీసెంట్ గానే పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్ మొదలవగా దానికి కీరవాణి(Keeravani), సునీత(Sunitha), లిరిసిస్ట్ చంద్రబోస్ (chandrabose) జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో నుంచి రీసెంట్ గా సింగర్ ప్రవస్తి(pravasthi) ఎలిమినేట్ అయింది.
ఎలిమినేట్ అయిన తర్వాత ప్రవస్తి ఆ షో గురించి, అందులో జడ్జిలుగా ఉన్న వారి గురించి పలు విషయాలను చెప్తూ యూట్యూబ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఎవరైనా పాడుతా తీయగా ప్రోగ్రామ్ కు వెళ్లాలనుకుంటే రికమండేషన్ లేదా ఎవరైనా రిఫరెన్స్ తో వెళ్లమని, లేకపోతే తనకు జరిగినట్టే అన్యాయం జరుగుతుందని వెల్లడించింది.
జడ్జిలుగా ఉన్నప్పుడు ఎవరైనా న్యాయం వైపే మాట్లాడాలని, కానీ తనకు ఆ షో లో న్యాయం జరగలేదని, సునీత కావాలని తనకు నెగిటివ్ కామెంట్స్ ఇచ్చేదని, తన గురించి లేనిపోనివన్నీ కీరవాణికి చెప్పేదని, కీరవాణి తనను చాలా అవమానించారని, చంద్రబోస్ కూడా కావాలని తనకు పాజిటివ్ కామెంట్స్ ఇచ్చేవాళ్లు కాదని, కావాలని తనను టార్గెట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తను ఇప్పుడు ఇలా అన్నీ విషయాలు బయటపెట్టినందుకు తనను, తన ఫ్యామిలీని ఏమైనా చేస్తే దానికి బాధ్యులు ఆ ముగ్గురే అని కూడా ప్రవస్తి తెలిపింది.






