ప్రభాస్- మారుతి మూవీ.. ష్యూర్ షాట్ హిట్
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. కానీ ఇప్పటి వరకు వారు ఆ విషయాన్ని ఇంకా అనౌన్స్ చేసింది లేదు. కానీ ఈ విషయంలో ఇన్‌డైరెక్ట్ హింట్స్ మాత్రం ఇస్తున్నారు. రీసెంట్గా ఈ బ్యానర్ నుంచి బన్నీ బర్త్‌డే కు విషెస్ చెప్తూ ఓ పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్‌కు బన్నీ ఫ్యాన్ రియాక్ట్ అవుతూ, బన్నీకి విషెస్ చెప్పినందుకు థాంక్స్ చెప్తూనే, ప్రభాస్, మారుతి కాంబోలో నిర్మిస్తున్న సినిమా బాగా రావాలనుకుంటున్నా అని తెలిపాడు. ఆ ట్వీట్ కు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీమ్ స్పందించింది.
ష్యూర్ షాట్‌గా సినిమా బాగుంటుందని పీపుల్స్ మీడియా ఇచ్చిన రిప్లైకు ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం ఇంకా క్లారిటీ లేదు కానీ షూటింగ్ పూర్తవడానికి మాత్రం చాలానే టైమ్ పట్టే అవకాశముందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారు. కానీ ఈ టైటిల్ పాన్ ఇండియన్ లెవల్లో వర్కవుట్ అవుతుందా అనే దిశగా మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఈ మూవీ స్టోరీ మొత్తం రాజా డీలక్స్ అనే ఓ పాడుపడ్డ థియేటర్ చుట్టూ తిరగబోతుందని అందుకే ఈ టైటిల్ అనుకున్నట్లు సమాచారం.













