అదే ఈ సంవత్సరం ప్రభాస్ బర్త్‌డేకి ఉన్న స్సెషాలిటీ. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు!
దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలూ ఇప్పుడు ప్రభాస్ వైపే చూస్తున్నాయి. ఎందుకంటే బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రభాస్ నెక్స్ట్ చేయబోయే సినిమాల తాలూకు డీటెయిల్స్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ దశలో ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి.అశ్వినీదత్ నిర్మించే సోషియో ఫాంటసీ సినిమా లైన్లోకి రావాల్సి ఉంది. కానీ, సడన్‌గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్‌తో ఎంట్రీ ఇచ్చాడు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో రావణుడుగా సైఫ్ అలీఖాన్ నటించనున్నాడు. నాగ్ అశ్విన్ సినిమా తర్వాతే ఈ సినిమా ప్రారంభమవుతుందని అందరూ భావించారు.
కానీ, రాధేశ్యామ్ తర్వాత ఆదిపురుష్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సీత పాత్ర చాలా కీలకమైంది. ఆ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో చిత్ర యూనిట్ కుస్తీలు పడుతోంది. అలాగే లక్ష్మణుడు, హనుమంతుడి పాత్రలు కూడా ఈ కథలో కీలకమే. సినిమాలోని కీలకమైన పాత్రల్లో ఎవరు నటిస్తే బాగుంటుంది అనే విషయంలో చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 23న హీరో ప్రభాస్ పుట్టినరోజు రాబోతోంది. ఈలోగా నటీనటుల ఎంపిక పూర్తి చేసి ఆరోజున టోటల్‌గా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వివరాలను ప్రకటించాలని ఓం రౌత్ భావిస్తున్నాడు. అలాగే రాధేశ్యామ్‌కి సంబంధించి కూడా ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని ఆ చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు రాధేశ్యామ్ సినిమాకి సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే రెడీ చేశారని తెలుస్తోంది. అలాగే నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ బర్త్‌డేకి ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేసే గిఫ్ట్‌తో రాబోతున్నాడని సమాచారం. అంటే ఈ ఏడాది ప్రభాస్ బర్త్‌డే చాలా గ్రాండ్‌గా జరిగే అవకాశం కనిపిస్తోంది. మూడు పాన్ ఇండియా సినిమాలతో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్న ప్రభాస్ ఈ మూడు సినిమాలతో తన రేంజ్‌ని మరింత పెంచుకునే అవకాశం కనిపిస్తోంది.













