మరో కొత్త వివాదంలో పూనమ్ అరెస్ట్
కొంతమంది సినిమా తారలు వారు చేసే సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అవుతుంటారు. ఇలాంటి వారు భాషా భేదం అనేది లేకుండా అన్ని భాషల సినిమా రంగాల్లో ఉన్నారు. బాలీవుడ్ విషయానికి వస్తే పూనమ్ పాండే ఇలాంటి విషయాల్లో ముందు వరసలో ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తలకెక్కడం ఆమెకు ఆనవాయితీగా మారిపోయింది. ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ నిబంధనలు అమవుతున్నాయి. వాటిని ఉల్లంఘిస్తూ పూనమ్ పాండే తన బాయ్‌ఫ్రెండ్ సామ్ అహ్మద్‌తో కలిసి కారులో తిరుగుతుండగా ముంబయ్ పోలీసు పట్టుకున్నారు. వారిని ప్రశ్నించగా బయటకు రావడానికి ఎలాంటి కారణం కనిపించలేదు. దాంతో వారిపై కఠినంగా వ్యవహరించారు పోలీసులు. పూనమ్ పాండే, ఆమె ప్రియుడు సామ్ ఆహ్మద్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారా? అంటూ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వారు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారును సీజ్ చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 188, 269, 51 బీ ప్రకారం కేసు నమోదు చేశారు. అంతేకాకుండా లాక్డౌన్ నిబంధనలను బేఖాతరు చేసినందుకుగానూ పూనమ్ పాండేను ముంబై పోలీసు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు పంపించారు.
పూనమ్‌కు ఇది కొత్తేమీ కాదు
బాలీవుడ్లో ఓ వెలుగు వెలగాలని వచ్చిన పూనమ్‌కు అవకాశాలు ఎక్కువగా రాకపోవడంతో కాంట్రవర్సీనే ఎక్కువగా నమ్ముకుంది. నగ్నంగా ఫోజులిచ్చి దేశంలోని పలు సంస్థలు వేసే క్యాలెండర్లలో గ్లామర్‌గా దర్శనమిచ్చింది. ఇలాంటి నగ్న చిత్రాల వల్ల దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని వివిధ సంస్థలు ఎంత మొత్తుకున్నా.. ‘‘నా వల్ల అలాంటివి జరుగుతున్నాయని నాపై నిందు మోపడం సరికాదు’’ అంటూ వాటిని కొట్టిపారేసింది. ఆ తర్వాత మరో కొత్త ఎత్తుగడతో తెరపైకి వచ్చింది పూనమ్. 2011లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్‌లో ఇండియా కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియం మొత్తం తిరుగుతానని ప్రకటించింది. అనుకున్నట్టుగానే ఇండియా వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. కానీ, పూనమ్ మాత్రం తన మాట నిబెట్టుకోలేదు. తాను నగ్నంగా తిరిగేందుకు సిద్ధంగానే ఉన్నానని, క్రికెట్ బోర్డ్ దానికి అంగీకరించలేదని చెప్పుకొచ్చింది. అయినా తన పట్టు వదల్లేదు. అర్థరాత్రి స్టేడియమ్‌కు చేరుకొని తాను చెప్పినట్టుగానే నగ్నంగా మారుతున్న వీడియోను యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. ఇలాంటివి పూనమ్ కెరీర్లో కోక్లొల్లలు. లాక్ డౌన్ టైమ్‌లోనూ బాయ్ ఫ్రెండ్‌తో కలిసి అరెస్ట్ అయి మరోసారి వార్తల్లోకెక్కింది పూనమ్.













