స్టార్ పెయిర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
మాస్టర్ తో ఈ యేడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు స్టార్ హీరో విజయ్. లాక్ డౌన్ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో హైయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా మాస్టర్ నిలిచింది. మాస్టర్ ఇచ్చిన బూస్టప్ తో విజయ్ తన తర్వాతి సినిమా అయిన విజయ్65 ను మొదలెట్టనున్నాడు.
రీసెంట్ గా పూజా కార్యక్రమాలను ముగించుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఏప్రిల్ చివరి వారంలో లేదా మే ఫస్ట్ వారంలో మొదలెట్టనున్నట్లు టాక్. ఫస్ట్ టైమ్ విజయ్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటించనుంది. వీరిద్దరూ కలిసి నటించనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఈ సినిమాను ఈ యేడాది మాస్టర్ లాగే, వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారట.
మాస్టర్ తో ఈ యేడాది సంక్రాంతికి మంచి కలెక్షన్స్ అందుకున్నాడు విజయ్. గతంలో కూడా సంక్రాంతి కి వచ్చిన విజయ్ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అందుకే విజయ్65 ను త్వరత్వరగా పూర్తి చేసేసి సంక్రాంతి బరిలో దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది చిత్ర యూనిట్. అంతేకాదు హీరోయిన్ పూజా కు కూడా తన కెరీర్లో పెద్ద హిట్ గా నిలిచిన అల వైకుంఠపురములో సంక్రాంతి టైమ్ లోనే రిలీజ్ అయింది. కాబట్టి ఇటు పూజాకు, అటు విజయ్ కు ఈ సంక్రాంతి సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేలా ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అనిరుధ్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది.













