Police Complaint: ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ లాంచ్
*సౌతిండియా హాట్ ఫెవరెట్ హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్ఫుల్ రోల్.. హీరోయిజంను ఫర్ఫెక్ట్ గా ప్లే చేసే హీరో నవీన్ చంద్ర పవర్ ఫుల్ రోల్ లో.. 52 మంది సీనియర్ ఆర్టిస్టులు.. హారర్ థ్రిల్లర్.. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా.. టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ ఫ్యాషనెట్ ఫిలిమ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకేక్కిస్తున్న మూవీ ‘పోలీస్ కంప్లైంట్’.*
ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి రచన–దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ తెలుగు, కన్నడ టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్ఫుల్ యాటిట్యూడ్‌తో పాటు తొలిసారిగా ఫుల్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లో అద్భుతంగా నటించారని నిర్మాత తెలిపారు. ఆమెకు జంటగా నవీన్ చంద్ర మరో బలమైన పాత్రలో నటించారు.
డైరెక్టర్ సంజీవ్ మేగోటి మాట్లాడుతూ… “ప్రేమ, పగ, తప్పు–ఒప్పు, మంచి–చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను హారర్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా రూపొందించాం. కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రత్యేక పాత్రలో ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తారు. ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఈ చిత్రంలో కృష్ణసాయి, బేబీ తనస్వి భిన్న పాత్రల్లో మెప్పిస్తారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఈ సినిమాలో భయంతో పాటు ఎంటర్టైన్మెంట్ అందిస్తారు. 45 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి వరలక్ష్మి యే కారణం. తెలుగు, తమిళం, మలయాళం కన్నడం.. నాలుగు భాషల్లో సినిమాను రూపొందిస్తున్నాం” అని అన్నారు.
ప్రధాన పాత్రల్లో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. “డైరెక్టర్ గారు చెప్పిన సబ్జెక్టు నచ్చి సినిమా చేశాను. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఫుల్లుగా కామెడీ చేశాను. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది.” అని అన్నారు.
ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్–రవితేజ ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది పాత్రలు వారి గత చిత్రాలకు భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు.
అతిథులుగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, హీరో కృష్ణసాయి, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి, అడివి సాయి కిరణ్, రావుల వెంకటేశ్వర రావు ఇతరులు పాల్గొని చిత్ర యూనిట్ కి విషెస్ తెలిపారు.
‘కథను బలంగా ప్రజెంట్ చేసే సత్తా ఉన్న సంజీవ్ మేగోటి ఒక passionate ఫిలిమ్ మేకర్. కథ–స్క్రీన్‌ప్లేకు ప్రత్యేకమైన ఇంటెన్సిటీ తీసుకొచ్చే దర్శకుడు. కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కంటెంట్‌తో బ్యాలెన్స్ చేస్తూ, ప్రతి సినిమా ద్వారా తన distinct directorial stampను స్పష్టంగా చూపిస్తున్నాడు’ అని ఈ సందర్భంగా చిత్రయూనిట్ తో పాటు పలువురు అతిథులు కొనియాడారు.






