తన అభిమానుల కోసం ఆ నిర్ణయం తీసుకున్న పవన్‌కల్యాణ్!
అజ్ఞాతవాసి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న పవన్‌కల్యాణ్ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నాడు. కానీ, అక్కడ ఆశించినంత విజయం సాధించలేకపోయాడు. అయినప్పటికీ పవన్ అభిమానులు ఆయన వెన్నంటే ఉన్నారు. ఎప్పటికైనా మళ్లీ సినిమాలు చేసి తమను ఎంటర్టైన్ చేస్తాడన్న నమ్మకంతో ఎదురుచూశారు. అనుకున్నట్టుగానే వరసగా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు పవన్. సినిమాల పరంగా ప్రేక్షకులకు, అభిమానులకు దూరంగా ఉన్నప్పటికీ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తన బర్త్‌డేకి ప్రూవ్ చేసుకున్నాడు పవన్. రికార్డు స్థాయిలో పవన్‌కు శుభాకాంక్షలు అందాయి. తమ అభిమాన హీరోకు ఉన్న క్రేజ్‌ను చూసి అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. వారిలో మరింత ఆనందాన్ని నింపేందుకే ఇకపై గ్యాప్ లేకుండా సినిమాలు చెయ్యాలని డిసైడ్ అయ్యాడు పవన్. వారిలో పుల్ జోష్‌లో నింపడానికి 2021లో పవన్ సరికొత్తగా అడుగులు వేయబోతున్నాడు. వకీల్‌సాబ్ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. క్రిష్ డైరెక్షన్లో చేయబోతున్న సినిమాను కూడా త్వరగానే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు పవన్.
వచ్చే ఏడాది ఆరంభంలో వకీల్‌సాబ్‌ను, సమ్మర్లో క్రిష్ సినిమాను రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నప్పటికీ ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యమయ్యే విషయం కాదని అర్థమవుతోంది. ఈ రెండు సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత హరీష్‌శంకర్ కాంబినేషన్లో చేయబోయే సినిమాను సెట్స్‌పైకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే సురేందర్‌రెడ్డి డైరెక్షన్లో చేయబోయే సినిమాను కూడా వచ్చే ఏడాదే స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నాడు పవన్. అతని కెరీర్లో ఇప్పటివరకు ఇంత స్పీడ్‌గా సినిమాలను ఎంపిక చేసుకోవడం, షూటింగ్ పూర్తి చేసి రిలీజ్‌కి వెళ్ళిపోవడం వంటివి జరగలేదు. ఎప్పుడైనా ఒక సినిమా తర్వాత మరో సినిమా పద్ధతిలో చేసుకుంటూ వెళ్లే పవన్ ఈసారి ఇంత పక్కా ప్లానింగ్‌తో వెళ్ళడానికి రీజన్ అభిమానులే. తన నుంచి అభిమానులు ఆశిస్తున్న సినిమాలను వారికి అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.













