కొత్త టైటిల్‌ని ఎనౌన్స్ చేస్తే బాగుంటుందంటున్న పవర్‌స్టార్ ఫ్యాన్స్
ప్రస్తుతం సినిమా పరిశ్రమ పరిస్థితి ఎలా ఉందంటే.. షూటింగులు లేకపోయినా, థియేటర్స్ రన్ కాకపోయినా, ఓటీటీలో సినిమాలు అంతగా ఆదరణ పొందకపోయినా.. సినిమా న్యూస్‌లకు, అప్డేట్స్ కు మాత్రం కొదవలేదు. ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. అది దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించింది కావచ్చు లేదా గాసిప్ కావచ్చు. మొత్తానికి సోషల్ మీడియాలో ఆ వార్త చక్కర్లు కొట్టాల్సిందే. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకు ఈ గాసిప్స్ వినిపించే అవకాశం ఎక్కువ. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాల గురించి తెలుసుకోవడం అంటే అందరూ ఆసక్తి చూపిస్తారు కాబట్టి.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే పవన్‌కల్యాణ్ వరసపెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. వకీల్‌సాబ్ షూటింగ్ 20 రోజులు బ్యాలెన్స్ ఉండగా లాక్డౌన్ వచ్చింది. ఆ సినిమా పూర్తయితే క్రిష్ డైరెక్షన్లో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయంలో ప్రేక్షకులు, అభిమానులు ఒక క్లారిటీకి వచ్చారు. పవన్ ఈ సినిమాలో రాబిన్‌హుడ్ తరహా పాత్ర పోషించబోతున్నాడని సమాచారం. ఈ సినిమాకి మొదటి నుంచీ `విరూపాక్ష` అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే నిజానికి ఈ సినిమా టైటిల్ అది కాదని ఇటీవల మరో న్యూస్ వచ్చింది. `ఓం శివమ్` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ చిత్ర నిర్మాతలు ఓం శివమ్ టైటిల్‌ను రిజిష్టర్ చేయించారు. అది తప్పకుండా పవన్‌కల్యాణ్, క్రిష్ సినిమాకి సంబంధించిన టైటిలేనని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు. ఈ టైటిల్‌ని కన్ఫర్మ్ చెయ్యాల్సింది దర్శకనిర్మాతలు. వారు ముందుకొచ్చి ఈ సినిమా గురించి మాట్లాడితే తప్ప టైటిల్ ఏమిటి అనేది తెలియదు. వకీల్‌సాబ్ తర్వాత వెంటనే స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ ఇదే కాబట్టి టైటిల్ కూడా ఎనౌన్స్ చేస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.













