వరల్డ్ రికార్డును క్రియేట్ చేసిన పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్!
ఈమధ్యకాలంలో టాలీవుడ్ హీరోల అభిమానులు తమ ట్వీట్స్‌తో రికార్డులు సృష్టిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ , పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ ప్రతి ట్రెండ్‌లోనూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు బర్త్ డే ట్రెండ్‌లో ఇరవై నాలుగు గంటల్లో 59.21/60.20 మిలియన్ ట్వీట్స్ ను వేసి బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డులలో ఇండియాలో మొదటి స్థానం, ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానంలో నిలవగా పవన్ ఫ్యాన్స్ ఈ రికార్డులను బ్రేక్ చేసి టాలీవుడ్లో క్రేజ్ విషయంలో పవన్‌కి ఎదురులేదని మరోసారి నిరూపించారు.
వరల్డ్ రికార్డు నమోదు చేసేందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 24 గంటల్లో దాదాపు 61 మిలియన్ల ట్వీట్లను వేయవలసి ఉంటుంది. ఇందులో ట్వీట్ల తో పాటు రీట్వీట్లను కూడా లెక్కిస్తారు. 20 గంటల 45 నిమిషాల్లోనే 50 మిలియన్ ట్వీట్స్ వేసిన పవన్ ఫ్యాన్స్ అత్యంత వేగంగా 10, 20, 30, 40 మిలియన్ల ట్వీట్స్ వేసిన ఘనత కూడా సాధించారు. ఆ తర్వాత 24 గంటలు పూర్తి కాకముందే ప్రపంచ రికార్డు 60.20/60.3 ని బద్దలు కొట్టడం గమనార్హం. ఇంకా ఒక అరగంట సేపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ఊపులో ఆ సెలబ్రేషన్స్ లో మరిన్ని మిలియన్లకు ట్వీట్లు వేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ రికార్డును బద్దలు కొట్టడానికి ఏ హీరో ఫ్యాన్స్ రెడీగా ఉన్నారో చూడాలి.













