Parasakthi: ఆఖరి దశలో పరాశక్తి షూటింగ్

కోలీవుడ్ నటుడైనప్పటికీ తెలుగులోనూ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు శివ కార్తికేయన్(siva karthikeyan). రీసెంట్ గా మదరాసి(madarasi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ కార్తికేయన్ ప్రస్తుతం పరాశక్తి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల(sree leela) హీరోయిన్ గా నటిస్తుండగా జయం రవి(jayam ravi), రానా దగ్గుబాటి(rana daggubati) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
పరాశక్తి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రిలీజ్ డేట్ టార్గెట్ ను అందుకోవాలనే ఆలోచనతో మేకర్స్ షూటింగ్ ను వేగంగా పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చిందని, షూటింగ్ ఆఖరి దశలో ఉందని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
డాన్ పిక్చర్స్(Don Pictures) బ్యానర్ లో ఆకాష్ భాస్కరన్(aakash bhaskaran) పరాశక్తిని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి త్వరలోనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను స్టార్ట్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పోటీగా సంక్రాంతికి పలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి అంత పోటీలో పరాశక్తి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.