Abir Gulal: ఫహల్గాం దాడి.. బాలీవుడ్ మూవీ బ్యాన్ ?
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అందరినీ కలచివేస్తోంది. ఈ ఉగ్రదాడిలో అమాయకులైన 28పైగా టూరిస్టులు చనిపోవడం అందరినీ బాధిస్తోంది. అక్కడి ప్రాంతాన్ని చూసి ఆనందించాలని వెళ్లిన టూరిస్టులను ఉగ్రవాదులు మతం అడిగి మరీ ప్రాణాలు తీసిన విధానం అందరిలోనూ ఆగ్రహ జ్వాలలను రేపుతున్నాయి.
దీంతో అందరూ ఈ దాడి పాకిస్తానే చేయించి ఉంటుందని, ఆ దేశానికి సంబంధించిన పలు విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ సినిమా నెట్టింట హాట్ టాపిక్ అయింది. అదే అబిర్ గులాల్(Abir Gulaal). మే 9న రిలీజ్ కానున్న ఈ సినిమాలో పాకిస్తాన్ నటుడు ఫవర్ ఖాన్(Fawar khan) నటిస్తుండటమే దానికి కారణం. వాణి కపూర్(Vani Kapoor) హీరోయిన్ గా ఫవర్ ఖాన్ హీరోగా ఆర్తి ఎస్ బాగ్ది(Aarthi S bagdhi) డైరెక్టర్ గా తెరకెక్కిన ఈ సినిమాను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
పాకిస్తానీ నటుడున్న సినిమాను మేం చూడమని, అబీర్ గులాల్ ను బ్యాన్ చేయాలని, ఈ సినిమాను రిలీజ్ కాకుండా చూడాలని కోరుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల హ్యాష్ ట్యాగులతో ట్రెండ్ చేస్తున్నారు. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కానీ బాలీవుడ్ కథనాల ప్రకారం అబీర్ గులాల్ వాయిదా పడుతుందని తెలుస్తోంది. ఏదేమైనా ఈ ఎటాక్ పై ఫవర్ ఖాన్ స్పందించి ఏదొకటి మాట్లాడితే తప్పించి తనపై వ్యతిరేకత పోయేలా లేదు.






