యంగ్ టైగర్ త్రివిక్రమ్ మూవీ తెలుగు సంవత్సరాదిన ఆరంభం?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మూవీ సూపర్ హిట్ కొట్టి వారిద్దరి కాంబోకి బాగా క్రేజ్ తెచ్చిపెట్టింది. దాని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ నంబర్ 30 చేయనున్నారు ఎన్టీఆర్.
నిజానికి ఈ పాటికి ఈ మూవీ ప్రారంభం కావాల్సి ఉండగా మధ్యలో కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆలస్యం కావడంతో దీనిని కొన్నాళ్లపాటు ముందుకు జరిపారు. అయితే లేటెస్ట్ గా పలు ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాని వచ్చేనెల 13న ఉగాది పండుగ కానుకగా ముహూర్తం చేసేందుకు యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆ రోజున అధికారిక పూజా కార్యక్రమాలు జరిపిన అనంతరం ఫస్ట్ షెడ్యూల్ మొదలవుతుందని అంటున్నారు. అలానే దీనిని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారని సమాచారం. రెండోసారి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో యస్ . రాధా కృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఏ రేంజి సక్సెస్ ని అందుకుంటుందో తెలియాలంటే మరి కొన్ని నెలల వరకు ఎదురు చూడక తప్పదు.













