నితిన్ సినిమాకు భలే టైటిల్
నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోసం టైటిల్ ను వెతుకుతున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే జూనియర్ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. కథకు ఈ టైటిల్ అయితే కరెక్ట్ గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి.
కానీ మేకర్స్ ఇప్పుడా డెసిషన్ ను మార్చుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ఇంత నార్మల్ గా ఉంటే ఆడియన్స్‌లోకి సినిమాను తీసుకెళ్లడం కష్టమని భావించిన మేకర్స్ ఇప్పుడు టైటిల్‌ను మార్చే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సినిమాకు ఎగస్ట్రా అనే కొత్త టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. దీనికి ట్యాగ్ లైన్‌గా ఆర్డినరీ మ్యాన్ అని పెట్టనున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.
వక్కంతం వంశీ రూపొందిస్తున్న ఈ సినిమా స్టోరీ లైన్ కూడా ఇప్పటి వరకు ఎక్కడా లీక్ అయింది లేదు. ఎంతో మంది స్టార్ హీరోలకు మంచి కథలు అందించిన వక్కంతం వంశీ నితిన్ సినిమాను ఎలాంటి స్టోరీతో తెరకెక్కిస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా సక్సెస్ అటు నితిన్‌కు, ఇటు వక్కంతం వంశీకి ఇద్దరికీ చాలా కీలకం కానుంది.













