Niharika: చీరకట్టులో చూడముచ్చటగా నిహారిక
మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక(Niharika), యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, తర్వాత నటిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పలు పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే నిహారిక తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వైట్ రెడ్ కాంబినేషన్ లో ఉన్న చీర ధరించి, చేతికి గాజులు, తలలో మల్లెపూలు పెట్టుకుని ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించింది. నిహారికను ఈ లుక్ లో చూసిన వారు చీరలో చూడముచ్చటగా ఉందంటూ కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు.







