చిన్మయిపై సోషల్ మీడియాలో కొత్త డిస్కషన్
చిన్మయి శ్రీపాద(chinmayi sripada) మరోసారి సోషల్ మీడియా డిస్కషన్ లోకి వచ్చారు. రణ్‌బీర్ కపూర్(ranbir kapoor), సాయి పల్లవి(sai pallavi) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న రామాయణ సినిమాలోని జై జై రామ్(jai jai ram) సాంగ్ తమిళ వెర్షన్‌కు ఆమె గాత్రం అందించినట్లు తెలియడంతో ఈ వివాదం మొదలైంది. సాంగ్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ వెలువడిన వెంటనే, గతంలో రాముడు, సీత పాత్రలపై చిన్మయి చేసిన కామెంట్స్ ను కొందరు నెటిజన్లు మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.
ముఖ్యంగా సీతను అరణ్యవాసానికి పంపిన ఘట్టంతో పాటు రాముడి నిర్ణయాలపై ఆమె గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అప్పట్లోనూ ఆమె కామెంట్స్ పై డిస్కషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పాత పోస్టులను ఆధారంగా చేసుకుని కొందరు ఆమెను ప్రశ్నిస్తుండగా, మరికొందరు మాత్రం ఒక ఆర్టిస్టుగా ఆమె వృత్తిపరమైన భాగస్వామ్యాన్ని గత వ్యక్తిగత అభిప్రాయాలతో ముడిపెట్టడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక నితీశ్ తివారీ(nitesh tiwari) దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ(ramayana) రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనుండగా, యష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, చిన్మయి గొంతు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చకు దారితీసింది.








