Vishwambhara: విశ్వంభర నుంచి కొత్త కంటెంట్ వస్తోంది. ఎప్పుడంటే?
ఆరు పదుల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ఒకదాని తర్వాత ఒక సినిమాను లైన్ లో పెడుతున్న మెగాస్టార్ రీసెంట్ గా సంక్రాంతికి అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో మన శంకరవరప్రసాద్ గారు(MSG) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి, ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకుని మరోసారి తన సత్తాను చాటారు.
ఈ మూవీ తర్వాత చిరంజీవి రానున్న సినిమా విశ్వంభర(Vishwambhara). టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ(Vassishta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. వాస్తవానికి విశ్వంభర సినిమా ఇప్పటికే రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యమై, మన శంకరవరప్రసాద్ గారు(mana shankaravaraprasad Garu) ముందు రిలీజైంది. సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిన విశ్వంభర కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
అయితే ఈ మూవీ గురించి ఇప్పుడో లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తోంది. త్వరలోనే రానున్న మహా శివరాత్రికి విశ్వంభర నుంచి ఓ కొత్త వీడియో కంటెంట్ రిలీజవనుందని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యువి క్రియేషన్స్(UV Creations) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది.













