ఫిబ్రవరిలో నయనతార పెళ్లి ?
అగ్ర కథానాయిక నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్‌శివన్ మధ్య ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. గత నాలుగేళ్లుగా వీరిద్దరు తమ ప్రణయబంధాన్ని కొనసాగిస్తున్నారు. విదేశీ పర్యటనల సందర్భంగా ఈ జంట తీసుకున్న పొటోలు సోషల్‌మీడియాలో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. లాక్డౌన్ సమయంలో ఈ ప్రేమజంట చెన్నైలో సహజీవనం చేశారు. గత ఏడాదికాలంగా వీరిద్దరి పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో ఈ జంట తమిళనాడులోని ఓ ప్రముఖ చర్చిలో వివాహం చేసుకోబోతున్నారని సమాచారం.
లాక్డౌన్ కారణంగా తమ పెళ్లి ప్రయత్నాల్ని వాయిదా వేసుకుంటూ వచ్చిన ఈ జంట తాజాగా కుటుంబ సభ్యుల సమ్మతితో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారట. అయితే ఈ దర్శకనాయిక జోడీ వివాహం గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా.. నయనతార సన్నిహితులు మాత్రం ఫిబ్రవరిలో వివాహం ఖాయమని చెబుతున్నారు.













