Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Naveen polishettys sankranthi promo laugh riot blockbuster coming this sankranti

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ చిత్రం నుంచి సంక్రాంతి టీజర్ విడుదల

  • Published By: techteam
  • September 26, 2025 / 12:51 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Naveen Polishettys Sankranthi Promo Laugh Riot Blockbuster Coming This Sankranti

తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్‌ పొలిశెట్టి, మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju)తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు వినోదాల విందుని హామీ ఇచ్చింది.

Telugu Times Custom Ads

బంగారు ఆభరణాల ప్రకటనపై స్పూఫ్ తో ప్రారంభమైన ఈ టీజర్, ఎంతో వైవిధ్యంగా ఉంది. ఒంటి నిండా ఆభరణాలు ధరించిన మీనాక్షి చౌదరి, తమ సినిమా గురించి కాకుండా ఆభరణాల గురించి మాట్లాడుతుండటంతో.. ఆమె ఆభరణాలను నవీన్ పొలిశెట్టి ధరించి కనిపించడం భలే సరదాగా ఉంది. టీజర్ లో నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి పోటాపోటీగా నవ్వులు పంచారు. వినోదాల వేడుకకు వేదికగా ఈ టీజర్ నిలిచింది. ఇప్పటికే విడుదైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజా టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆభరణాల ప్రకటన స్పూఫ్ తో ప్రారంభమైన టీజర్, ఆ తర్వాత సినిమాలోని ఉత్సాహభరితమైన దృశ్యాలను ఆవిష్కరించింది. నవీన్ యొక్క అద్భుతమైన హాస్య చతురత, అనంతమైన ఆకర్షణ ప్రతి ఫ్రేమ్ లో ప్రకాశించింది. తెరపై నవీన్ ఉత్సాహంగా కనిపించిన తీరు.. ఆయన ఈ సినిమా యొక్క గుండె మాత్రమే కాకుండా, సంక్రాంతి వేడుకలకు ముఖం కూడా అని చాటి చెబుతోంది.

పండుగ ఉత్సాహం, రంగురంగుల సెట్లు, మాస్ అంశాలు, కామెడీ, రొమాన్స్ మేళవింపుతో ఎంతో వినోదభరితంగా రూపొందిన ఈ టీజర్ కట్టిపడేస్తోంది. సంక్రాంతి పండుగకు ప్రేక్షకులు కోరుకునే అసలైన వినోదాల విందుకి వాగ్దానంలా ఈ టీజర్ నిలిచింది.

కేవలం ఒక నిమిషం కంటే ఎక్కువ నిడివితో రూపొందిన ఈ టీజర్, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అంతేకాకుండా హాస్యం, తాజాదనం మరియు కమర్షియల్ పంచ్‌లను మిళితం చేసే చిత్రాలను ఎంచుకోవడంలో నవీన్ పొలిశెట్టి నైపుణ్యాన్ని పునరుద్ఘాటించింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ నవీన్ ఖాతాలో మరో ఘన విజయం ఖాయమని ప్రశంసలు కురిపిస్తున్నారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్‌ పొలిశెట్టి రచయిత కావడం విశేషం. తన రచయితల బృందంతో కలిసి వినోదభరితమైన స్క్రిప్ట్ ని అందించారు. ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కేవలం నవ్వులు పంచడం మాత్రమే కాకుండా, అసలు సిసలైన పండుగ సినిమాని అందించడానికి సిద్ధమవుతున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి, ఛాయాగ్రాహకుడిగా జె యువరాజ్ వ్యవహరిస్తున్నారు.

సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న విడుదల కానున్న ‘అనగనగ ఒక రాజు’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్, ఆ అంచనాలను రెట్టింపు చేసింది.

 

 

Tags
  • Anaganaga Oka Raju
  • Meenakshi
  • Naga Vamsi S
  • Naveen Polishetty

Related News

  • Do You Know The Price Of Samanthas Watch

    Samantha: స‌మంత పెట్టుకున్న వాచ్ ధ‌రెంతో తెలుసా?

  • Pooja Hegde Posing In Traditional Dress

    Pooja Hegde: సాంప్ర‌దాయ దుస్తుల్లో క‌వ్విస్తోన్న పూజా హెగ్డే

  • Og Movie Success Celebrations

    OG: నమ్మకాన్ని నిజం చేసి ‘ఓజీ’ సినిమాకి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు- చిత్ర బృందం

  • Never Seen Content Once Again From The Makers Of Muddy Comes Another Cinematic Adventure Jockey Motion Poster Released

    Jockey: ఇండియన్ మూవీలో ఎవరు టచ్ చేయని పాయింట్ తో వస్తున్న ‘జాకీ’ చిత్రం ఫస్ట్ లుక్

  • The Gameyou Never Play Alone Trailer Out

    The Game-You Never Play Alone: ది గేమ్- యు నెవర్ ప్లే అలోన్ నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆసక్తికరమైన సిరీస్ ట్రైలర్

  • Godari Gattupaina First Breeze Out Now

    Godaari Gattu Paina: సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ ఫ్రెష్, సోల్ ఫుల్ ఫస్ట్ బ్రీజ్

Latest News
  • Nara Lokesh: ఎస్కేయూ అక్రమాలపై విచారణకు కమిటీ : మంత్రి లోకేశ్‌
  • Harjit Kaur: 33 ఏళ్లుగా అమెరికాలో.. అయినా స్వ‌దేశానికి గెంటివేత‌
  • Bihar: ఎన్నికల వేళ బిహార్‌ మహిళలకు … నవరాత్రి కానుక
  • Donald Trump: ఇజ్రాయెల్‌ను అనుమతించను : ట్రంప్‌
  • Balakrishna: కూటమిని చిక్కుల్లోకి నెట్టిన బాలయ్య..!!
  • Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు కృషి పై స్పందించిన లోకేష్..
  • Jagan: 2026 కి భారీ స్కెచ్ తో రెడీ అవుతున్న జగన్..
  • Pawan Kalyan: ఇటు బాలయ్య సెటైర్.. అటు చిరంజీవి క్లారిటీ.. మధ్యలో పవన్ కళ్యాణ్..
  • BRS: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు..!
  • Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ చిత్రం నుంచి సంక్రాంతి టీజర్ విడుదల
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer