నాని నా సేఫ్ ప్లేస్.. రాఘవ్ జుయాల్ ఎమోషనల్ నోట్
ది ప్యారడైజ్(the paradise) సినిమా తర్వాత నాని(nani)- రాఘవ్ జుయాల్(Raghav juyal) మధ్య ఏర్పడిన బాండింగ్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. సినిమాలో కలిసి పనిచేసిన ఎక్స్‌పీరియెన్స్ రాఘవ్‌పై స్పెషల్ ఇంపాక్ట్ ను చూపినట్లు తెలుస్తోంది. తాజాగా నానితో తన బాండింగ్ ను గుర్తు చేసుకుంటూ రాఘవ్ రాసిన ఎమోషనల్ నోట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కెరీర్ విషయంలో తడబడిన సందర్భాల్లో నాని తనకు అండగా నిలిచారని రాఘవ్ పేర్కొన్నారు.
సినిమాల గురించి మాత్రమే కాకుండా కెరీర్, పర్సనల్ లైఫ్ వంటి ఎన్నో విషయాలపై నానితో గంటల తరబడి మాట్లాడినట్లు రాఘవ్ వెల్లడించారు. తన మాటలను ఓపికగా విని, తనకు అర్థమయ్యేలా నాని ఇచ్చిన సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పారు. తాను ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నానో క్లారిటీ రావడంతో పాటు, కెరీర్ కోసం పరిగెత్తే క్రమంలో ఎలాంటి వ్యక్తిగా ఉండాలో కూడా నాని తనకు గుర్తుచేశారని రాఘవ్ చెప్పుకొచ్చారు.
యాక్టర్ గా నాని టాలెంట్ ను ప్రశంసిస్తూనే, ఆయనలోని నిజాయితీ, మంచితనాన్ని రాఘవ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు నాని ఒక సేఫ్ ప్లేస్ అంటూ పేర్కొన్న రాఘవ్.. కెరీర్‌కు మార్గనిర్దేశం చేయడంతో పాటు, పర్సనల్ గా కూడా తనను నిలబెట్టిన వ్యక్తిగా అభివర్ణించారు. ది ప్యారడైజ్ షూటింగ్ ద్వారా ఏర్పడిన ఈ బాండింగ్ సినిమా పూర్తైన తర్వాత కూడా కొనసాగుతున్నట్లు ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి.








