నాగార్జున ఆ స్కామ్ చేస్తున్నాడా..?
కింగ్ నాగ్ ప్రస్తుతం వైల్డ్ డాగ్ రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తర్వాత ఆయన గెస్ట్ రోల్ చేసిన పాన్ ఇండియన్ ఫిల్మ్ బ్రహ్మాస్త్ర కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. మరోవైపు కళ్యాణ్ క్రిష్ణ డైరక్షన్ లో బంగార్రాజు చిత్రాన్ని మొదలు పెట్టేందుకు నాగ్ రెడీ అవుతున్నారు. ఈ బిజీ షెడ్యూల్ లో కూడా నాగ్ ఒక పాపులర్ వెబ్ సిరీస్ సీక్వెల్ లో నటించే యోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. తనకు ఒక వెబ్ సిరీస్ లో నటించాలనుందని నాగార్జున ప్రకటించగానే రకరకాల రూమర్లు పుట్టుకొస్తున్నాయి.
రీసెంట్ గా ఒక ఇంటర్వూలో నాగ్.. స్కామ్ 1992 వెబ్ సిరీస్ పైన ప్రశంసలు కురిపించారు. ఇండియన్ ఓటీటీల్లో బెస్ట్ సిరీస్ ఇది. 1990 ల్లో హర్షద్ మెహతా కథను తెరపై చిత్రీకరించిన విధానం నచ్చింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ కోసం చర్చలు జరుపుతున్నా అని నాగ్ అన్నారు. స్కామ్ 1992 డైరక్టర్ హన్సాల్ మెహతా నాగ్ ప్రశంసలకు సంతోషిస్తూ.. ఇది నాకు గొప్ప ప్రశంస. నాగ్ సర్ స్కామ్ 1992 గురించి మాట్లాడారు డ్యూడ్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం హన్సాల్ స్కామ్ 1992 సీక్వెల్ కు స్టోరీ రెడీ చేస్తున్నారు. దానికి స్కామ్ 2002: ది క్యూరియస్ కేస్ ఆఫ్ అబ్దుల్ కరీం తెల్గి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. వేల కోట్ల పోస్టల్ స్టాంప్స్ కుంభకోణానికి పాల్పడి అరెస్ట్ అయిన తెల్గి జీవితంపై సిరీస్ ఇది. తొమ్మిది వేల జీతానికి పని చేసిన ఒక యువకుడు 1.4 బిలియన్ డాలర్ల స్కామ్ ఎలా చేశాడనేది ఈ సినిమా కథాంశం. మరి సిరీస్ లో హీరో క్యారెక్టర్ లో నాగ్ చేస్తున్నారా లేదా ఏ క్యారెక్టర్ లో చేస్తారనేది చూడాలి.













