జైలర్2 పోటీలో నెగ్గిన నాగవంశీ
సూపర్‌స్టార్ రజనీకాంత్(rajinikanth) నటిస్తున్న జైలర్2(Jailer2)పై తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson dileep kumar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు థియేట్రికల్ హక్కుల విషయంలో కొంతకాలంగా పలువురు ప్రముఖ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా ఈ పోటీలో నిర్మాత నాగ వంశీ(naga vamsi) ముందంజలో నిలిచినట్లు సమాచారం. జైలర్2 కోసం భారీ మొత్తాన్ని వెచ్చించి తెలుగు రైట్స్ ను ఆయన సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ నెల్సన్ తో నాగ వంశీకి ఉన్న సన్నిహిత సంబంధం కూడా ఈ డీల్‌లో కీలకంగా మారినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నెల్సన్ తర్వాతి ప్రాజెక్ట్‌కు నాగ వంశీ అడ్వాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే పరిచయం జైలర్2 రైట్స్ డిస్కషన్స్ లోనూ ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏషియన్ సునీల్(Asian suneel), దిల్ రాజు(Dil raju) వంటి ప్రముఖ నిర్మాతలు కూడా రైట్స్ కోసం ప్రయత్నించినప్పటికీ, చివరకు నాగ వంశీ డీల్‌ను క్లోజ్ చేసినట్లు సమాచారం.
ఇక జైలర్2 రిలీజ్ విషయంలో కొంతకాలంగా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలోని కొన్ని భాగాలను రీషూట్ చేసినట్లు ప్రచారం జరిగినా, అక్టోబర్ 15న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. సన్ పిక్చర్స్(Sun pictures) నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్(Anirudh) సంగీతం అందిస్తున్నారు. అఫీషియల్ గా తెలుగు రైట్స్ అనౌన్స్మెంట్ వెలువడిన తర్వాత డీల్ విలువపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.








