War2: వార్2 హక్కుల కోసం నాగ వంశీ ప్రయత్నాలు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హంక్ హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి చేస్తున్న సినిమా వార్2(War2). అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటుంది. ఆగస్ట్ 14న వార్2 ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా నుంచి రీసెంట్ గా క్రేజీ పోస్టర్స్ రిలీజయ్యాయి.
ఈ పోస్టర్లు చూశాక అప్పటివరకు వార్2 పై ఉన్న అంచనాలు ఇంకాస్త పెరిగాయి. అయితే వార్2 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరుగుతుందని సమాచారం. వార్2 కు ఉన్న డిమాండ్, దాంతో పాటూ క్రేజీ ప్రాజెక్టు కావడంతో నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) ఈ సినిమా హక్కులను ఎవరికీ ఇవ్వకుండా తామే సొంతంగా రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
కానీ వార్2 సినిమా తెలుగు హక్కులను ఎలాగైనా సొంతం చేసుకోవాలని టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ(Naga Vamsi) చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ వార్2 హక్కులను తీసుకోవడానికి నాగ వంశీ ఆసక్తిగానే ఉన్నాడని, కాకపోతే నిర్మాతలు తెలుగు హక్కులకు ఇంకా భారీ మొత్తం ఆశిస్తున్నారని తెలుస్తోంది. దీంతో వార్2 బిజినెస్ ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. మరి ఆఖరికి వార్2 సినిమా సొంతంగానే రిలీజవుతుందా లేదా మరెవరైనా సొంతం చేసుకుంటారా అనేది చూడాలి.