Naga Vamsi: విజయ్ ను అనవరసంగా విమర్శిస్తున్నారు

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda)కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంతేమంది నెగిటివ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే విజయ్ ఏం మాట్లాడినా దాన్ని విమర్శించే బ్యాచ్ కూడా ఉన్నారు. అందుకే తనపై ఎక్కువ నెగిటివిటీ వస్తుంటుంది. తాజాగా ఈ విషయంపై కింగ్‌డమ్(Kingdom) నిర్మాత నాగ వంశీ(Naga Vamsi) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
అసలు విజయ్ ను కావాలని ఎందుకు టార్గెట్ చేస్తారో తనకు తెలియదని, అసలే అతని సినిమాలు సరిగా ఆడక అతను డౌన్ లో ఉంటే కనీసం జాలి చూపించకుండా నెగిటివ్ కామెంట్స్ చేసి ట్రోల్ చేస్తున్నారని, రెట్రో(Retro) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ ఏదో చెప్పబోతే అది ఇంకేదోలా అర్థమైందని, ఈ విషయంలో విజయ్ బహిరంగంగా క్షమాపణ చెప్పినప్పటికీ వివాదం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందని నాగవంశీ అన్నారు.
అందరూ విమర్శిస్తున్నట్టు విజయ్ రియల్ లైఫ్ లో అలాంటి వాడు కాదని, చిన్న ఏజ్ లో విజయ్ బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేవాడనే విషయాన్ని తాను కూడా అంగీకరిస్తానని, కానీ ఇప్పుడు విజయ్ చాలా మారిపోయాడని, ప్రస్తుతం విజయ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని, విజయ్ తో ఎవరైనా పర్సనల్ గా మాట్లాడితే ఈ విషయం అర్థమవుతుందని నాగవంశీ కామెంట్ చేశారు.