చైతూ, సమంత చిత్రం ప్రారంభం
నాగచైతన్య, సమంత జంటగా రూపొందనున్న నూతన చిత్రం ప్రారంభమైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్ర ప్రారంభోత్సవం లాంఛనంగా నిర్వహించారు. నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై బౌండెడ్ స్క్రిప్ట్‌ను దర్శకుడు శివ నిర్వాణకు అందించారు. ఈ చిత్రంలో దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీనివాస్ అవసరాల, రావురమేష్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు రెండోవారం నుంచి మొదలవుతుంది. గోపీసుందర్ బాణీలు సమకూరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నిర్మాత నవీన్ యెర్నేని, రచయిత కోన వెంకట్ పాల్గొన్నారు.













