Vishwambhara: విశ్వంభర నైజాం బిజినెస్ క్లోజ్

భోళా శంకర్(bhola Shankar) ఫ్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని చిరంజీవి(chiranjeevi) అనౌన్స్ చేసిన సినిమా విశ్వంభర(vishwambhara). యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట(Vassishta)తో సినిమాను అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. బింబిసార(bimbisara) తర్వాత వశిష్ట చేస్తున్న సినిమా కావడంతో పాటూ చాలా కాలం తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కావడంతో విశ్వంభరపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
కానీ గతేడాది వచ్చిన టీజర్ లోని వీఎఫ్ఎక్స్ కు నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఏకంగా విఎఫ్ఎక్స్ వర్క్స్ బాధ్యతల్ని మరో కంపెనీకి అప్పగించి పూర్తి చేయించే పనిలో బిజీగా ఉంది. తాజాగా మెగాస్టార్ బర్త్ డే కు రిలీజ్ చేసిన మెగా బ్లాస్ట్ గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ఆల్రెడీ మొదలైనట్టు తెలుస్తోంది.
అందులో భాగంగానే విశ్వంభర థియేట్రికల్ రైట్స్ బిజినెస్ గురించి ఓ వార్త టాలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమా నైజాం హక్కులను మైత్రీ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఈ రైట్స్ ను మైత్రీ సంస్థ ఎంత మొత్తానికి సొంతం చేసుకుందనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. త్రిష(Trisha), ఆషికా రంగనాథ్(Aashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.