టాలీవుడ్లోకి బాలీవుడ్ భామ
యంగ్ హీరో నాగశౌర్య ఇటీవల ఓ బేబీ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం అతని చేతిలో దాదాపు నాలుగైదు సినిమాలున్నాయి. తాజాగా నాగశైర్య నటిస్తున్న ఓ చిత్రానికి మూగమనసులు అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ సిమాతో ఓ బాలీవుడ్ భామ టాలీవుడ్‌కి పరిచయం కానుందట. హృతిక్ నటించిన సూపర్ 30 లో నటించిన మృణాల్ ఠాకూర్‌ను నాగశౌర్య సినిమాలో హీరోయిన్గా తీసుకురానున్నారని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది.













