Dacoit: డెకాయిట్ సెట్స్ లో హీరోహీరోయిన్లకు గాయాలు
ఈ మధ్య సినిమా షూటింగుల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. దాని ద్వారా సినిమాలో పని చేసే వారు గాయపడటంతో పాటూ షూటింగ్ కూడా ఆలస్యమవుతూ వస్తుంది. తాజాగా టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్(Adivi Sesh) హీరోగా తెరకెక్కుతున్న డెకాయిట్(Dacoit) సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగినట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వార్తలొస్తున్నాయి.
షానియల్ డియో(Shaniel Deo) దర్శకత్వంలో తెరకెక్కుతున్న డెకాయిట్ మూవీ షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో హీరో అడివి శేష్ తో పాటూ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కు కూడా గాయాలయ్యాయని సమాచారం. అయితే గాయాలైనప్పటికీ వారిద్దరూ అలానే షూటింగ్ ను పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
షూటింగ్ అనంతరం వారు గాయాలకు ట్రీట్మెంట్ తీసుకున్నారని, అప్పటివరకు అలానే షూటింగ్ లో పాల్గొన్నారని తెలిసి నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) కీలక పాత్రలో నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో(Bheems Ciciroleo) డెకాయిట్ కు సంగీతం అందిస్తున్నాడు. డెకాయిట్ సినిమా క్రిస్మస్ కు ప్రేక్షకుల ముందుకు రానుంది.







