మహాభారతం విడుదల కానివ్వం
మహా ఇతిహాసం మహా భారతం చిత్రాన్ని దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. పద్మభూషణ్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎంటీ వాసుదేవన్ నాయర్ రచించిన రందమూళమ్ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మహాభారత్ ప్రాజెక్టును వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో నిర్మించనున్నారు. ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు భాషల్లోనే కాకుండా వేరే భాషలలోనూ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీకి అడ్డంకులు ఎదురైనట్టు తెలుస్తుంది. రందమూళం నవల ఆధారంగా తెరకెక్కించనున్న చిత్రానికి మహాభారతం అని పేరు పెడితే సినిమాను విడుదల కానివ్వమంటూ కేరళకు చెందిన హిందూ ఐక్యవేదిక సంఘం హెచ్చరించింది. నవల ఆధారంగా రూపొందనున్న సినిమాకి, వేద వ్యాసుడు రాసిన మహా భారతం పేరు ఎలా పెడతారు అంటూ సంఘం అధ్యక్షురాలు కె.పి. శశికళ హెచ్చరిస్తుంది. మహా భారత చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.













