కన్నప్పలో ఆ స్టార్ హీరో
మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు క్యాస్టింగ్ అంతకంతకూ పెంచుకుంటూ పోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. శివ పార్వతులుగా ప్రభాస్, నయనతార ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని సమాచారం.
తాజాగా ఈ సినిమా క్యాస్టింగ్ లో మలయాళ నటుడు మోహన్ లాల్ ఈ బృందంలో చేరడంతో ఇంకా అంచనాలు పెంచుతుంది. చాలా సెలెక్టివ్ గా తెలుగు సినిమాలు చేసే మోహన్ లాల్ ఈ సినిమా ఒప్పుకోవడంతో కన్నప్ప రేంజ్ మారిపోయింది. అయితే ఈ సినిమాలో ఆయనెలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాడనేది ఇంకా తెలియదు కానీ ఆదివాసీ తెగకు సంబంధించిన రోల్ అని తెలుస్తోంది.
అన్ని భాషల నుంచి యాక్టర్లను తీసుకోవడం ద్వారా ఈ సినిమా రేంజ్ ని పెంచుతున్న మేకర్స్, కన్నడ, హిందీ భాషల నుంచి ఎవర్ని సెలెక్ట్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రెమ్యూనరేషన్స్ పరంగా ఎలాంటి రాజీ పడకుండా మంచు కుటుంబం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప విషయంలో విష్ణు చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా 2025 మహా శివరాత్రికి రిలీజ్ చేయనున్నట్లు టాక్.













