Chiranjeevi: మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్ ఏంటంటే..
ఓ వైపు వశిష్ట(Vasishta)తో విశ్వంభర(Viswambhara), మరోవైపు అనిల్ రావిపూడి(anil ravipudi)తో మెగా157 చేస్తూ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చాలా బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తర్వాత కూడా చిరూ సాలిడ్ లైనప్ తో రెడీగా ఉన్నారు. రీసెంట్ గా విశ్వంభర(Viswambhara) షూటింగ్ ను పూర్తి చేసిన చిరూ, ఇప్పుడు మెగా157(Mega157) ను అనిల్ తో కలిసి ఓ కొలిక్కి తీసుకురావాలని డిసైడయ్యారు.
అందులో భాగంగానే అనిల్ కు ఫుల్ గా కో ఆపరేట్ చేస్తూ మెగా157 ను పూర్తి చేస్తున్నారు. నయనతార(nayanthara) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ అనుకున్న దాని కంటే వేగంగా పూర్తవుతోంది. ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న మేకర్స్ ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
మెగా157 టైటిల్ ను చిరూ పుట్టినరోజు నాడు రివీల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దాంతో పాటూ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అదే రోజున వెల్లడించాలని అనుకుంటున్నారట. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. కాగా మెగా157ను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే.







