మెగా158 మొదటి షెడ్యూల్ ప్లానింగ్ ఇదే!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కొత్త చిత్రం మెగా158(Mega158) అధికారికంగా ప్రారంభమై టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. నిన్న ఘనంగా నిర్వహించిన పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టగా, ఈరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైనట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) ఈ సినిమాను మాస్, ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మేళవింపుతో రూపొందిస్తున్నట్లు సమాచారం. మొదటి షెడ్యూల్లో చిరంజీవితో పాటూ యంగ్ హీరోయిన్ అనస్వర రాజన్(Anaswara Rajan) పాల్గొంటున్న కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రియమణి(Priyamani) త్వరలో షూటింగ్లో జాయిన్ కానున్నారని తెలుస్తోంది. మరోవైపు మలయాళ నటి హనీ రోజ్(Honey Rose) కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎంపికైనట్లు ఇండస్ట్రీలో బలమైన ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
సంక్రాంతి 2027 టార్గెట్ గా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్(Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విశ్వంభర(Vishwambhara) షూటింగ్ పూర్తి చేసిన చిరంజీవి, ఇప్పుడు పూర్తి ఫోకస్‌ను మెగా158పై పెట్టినట్లు తెలుస్తోంది. బాబీ మార్క్ మాస్ ట్రీట్‌తో పాటు చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందనే అంచనాలు అభిమానుల్లో కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి







